🌺ఇకపై ఏపీ నుంచే హజ్‌ యాత్ర

Extension in the last date for remittance of First Balance Amount
March 19, 2019
Application for Haj 2020
October 7, 2019

🌺ఆంధ్రప్రదేశ్‌లో హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు కేంద్రం శుభవార్త తెలిపింది. హజ్‌ యాత్రపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. వచ్చే ఏడాది నుంచి యాత్రికులు విజయవాడ నుంచి నేరుగా హజ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన హజ్‌ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఏపీలోని ముస్లింలు హజ్‌ యాత్ర కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. హజ్‌యాత్ర ఖర్చులో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

Comments are closed.

Previous Next
Close
Test Caption
Test Description goes like this